- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తలకు దెబ్బ తగిలి విద్యార్థి మృతి : గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్
జైనూర్ మండలంలోని పానపటార్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం 4వ తరగతి చదువుతున్న విద్యార్థి దుర్వా అన్వేష్ మృతి చెందిన ఘటన పై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి శనివారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

దిశ, ఆసిఫాబాద్ : జైనూర్ మండలంలోని పానపటార్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం 4వ తరగతి చదువుతున్న విద్యార్థి దుర్వా అన్వేష్ మృతి చెందిన ఘటన పై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి శనివారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో ఉదయం విద్యార్థులు పరీక్షలు రాసి హాస్టల్‌కు వచ్చారు. భోజనం అనంతరం కొందరు పిల్లలు మంచాలకు ఊయల కట్టి ఊగుతున్నారు. అన్వేష్ కూడా ఊయల పై ఎక్కి ఊగుతుండగా, ఊయల నుంచి కిందపడి సమీపంలోని ఇనుప పెట్టె పై పడటంతో అతనికి తలకు తీవ్ర గాయం అయిందన్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక సిబ్బంది వెంటనే బైక్ పై జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. అయితే వైద్యులు చికిత్స ప్రారంభించేలోపే అతను మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అతని తండ్రికి పానపటార్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.






