ఉదయం హ్యాపీగా వెళ్లి సాయంత్రం శవంగా వచ్చిన విద్యార్థి

by Bhoopathi Nagaiah |

స్కూల్‌కు వెళ్లి వస్తున్న విద్యార్థి ప్రాణం తీసిందో ఆటో. ఉదయం హ్యాపీగా ఇంటి నుంచి బయలుదేరిన బాలుడు.. సాయంత్రం శవంగా ఇంటికి తిరిగివచ్చాడు.

ఉదయం హ్యాపీగా వెళ్లి సాయంత్రం శవంగా వచ్చిన విద్యార్థి
X

దిశ, తిమ్మాపూర్ : స్కూల్‌కు వెళ్లి వస్తున్న విద్యార్థి ప్రాణం తీసిందో ఆటో. ఉదయం హ్యాపీగా ఇంటి నుంచి బయలుదేరిన బాలుడు.. సాయంత్రం శవంగా ఇంటికి తిరిగివచ్చాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడ్డటంతోఈ దుర్ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో మన్నెంపెల్లి శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాంపల్లి హర్షవర్దన్( 9 )అనే విద్యార్థి మృతి చెందగా మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గ్రామస్తులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story