క్రికెట్ ఆడొద్దన్నందుకు విద్యార్థి ఆత్మహత్య

by Muthe.Rajitha |

క్రికెట్ ఆడవద్దని తల్లి మందలించినందుకు సూసైడ్ చేసుకున్నాడు కుమారుడు.

క్రికెట్ ఆడొద్దన్నందుకు విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ ఆడవద్దని తల్లి మందలించినందుకు సూసైడ్ చేసుకున్నాడు కుమారుడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దండేపల్లిలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల ఆకర్ష్ ఇంటి పట్టున ఉండకుండా క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడని తల్లి శ్రీదేవి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన ఆకర్ష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. అయితే ఎంతసేపటికీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చిన తల్లి భయంతో ఇరుగుపొరుగు వారిని పిలవగా అంతా కలిసి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆకర్ష్ ఫ్యాన్ కు వేలాడుతున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబం తీరని దుఃఖంలో మునిగిపోయింది.

Next Story