జేఎన్టీయూహెచ్‌లో స్టూడెంట్ ఆత్మహత్య.. సూసైడ్ లేఖలో ఏం రాశాడు..?

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-31 13:03:16  IST  )

జేఎన్టీయూలో స్టూడెంట్ ఆత్మహత్య

జేఎన్టీయూహెచ్‌లో స్టూడెంట్ ఆత్మహత్య.. సూసైడ్ లేఖలో ఏం రాశాడు..?
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్ జేఎన్టీయూహెచ్(JNTUH)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామ పరిధిలోని ఓ తండాకు చెందిన మహేందర్(24) శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య(Student Suicide)కు పాల్పడ్డాడు. మూడు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా రూంకే పరిమితమైన మహేశ్ ఇవాళ తోటి స్టూడెంట్స్ క్లాసులకు వెళ్లిన తర్వాత తలుపులు బిగించుకొని సూసైడ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం రూంకు తిరిగి వచ్చిన తోటి విద్యార్థులు ఉరి వేసుకున్న మహేష్‌ను గమనించి యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

వాళ్లు వచ్చి మహేష్‌ను కిందికి దింపి యూనివర్సిటీ అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా, మృతుడి గదిలో సూసైడ్ నోట్ దొరకడంతో యూనివర్సిటీ సిబ్బంది తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆ లేఖలో ఏం రాశాడు..? అసలు మహేష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియరాలేదు. జేఎన్టీయూహెచ్‌లో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న మహేష్ మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ డెత్‌పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story