ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి అత్యంత విషమం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 04:58:46  IST  )

ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసకుంది. ఇంజినీరింగ్ విద్యార్థి వనీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి అత్యంత విషమం
X

దిశ, వెబ్‌డెస్క్/సికింద్రాబాద్: ప్రశాతంగా ఉండే ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న మహబూబాబాద్‌కు చెందిన వనీశ్ అనే విద్యార్థి, క్యాంపస్ ప్రాంగణంలోని లేడీస్ హాస్టల్ ఎదుట తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో విద్యార్థి ఆర్తనాదాలు చేశాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పివేశారు. ఈ మేరకు తీవ్రంగా గాయపడిన వనీశ్‌ను తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది హుటాహుటిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వనీశ్ శరీరంలో సుమారు 70 శాతానికి పైగా కాలిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అయితే, వనీశ్ ఆత్మహత్యాయత్నానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్యాంపస్‌లో విషాద ఛాయలు..

నిరంతరం విద్యార్థుల సందడితో ఉండే ఉస్మానియా క్యాంపస్‌లో ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. వనీశ్ త్వరగా కోలుకోవాలని తోటి విద్యార్థులు ప్రార్థిస్తున్నారు. మరోవైపు, విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Next Story