సుల్తాన్‌పూర్‌లో తుపాను బీభత్సం: ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు

by Kema Shiva Kumar |

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో సంభవించిన ఘోర తుపాను బీభత్సానికి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.

సుల్తాన్‌పూర్‌లో తుపాను బీభత్సం: ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తుఫాను బీభత్సం కారణంగా ఐడుగురు ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ (Sultanpur) జిల్లాలో చోటుచేసుకుంది. వర్ష బీభత్సం, ఈదురుగాలుల ధాటికి గోడలు కూలడం, చెట్లు విరిగిపడటంతో ఏడుగురు మరణించగా అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 20 మందికి పైగా బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, ఈదురుగాలుల ధాటికి అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలను చేపట్టింది. బాధితులకు అవసరమైన వైద్య సాయం అందించాలని, నష్టపరిహారంపై అంచనా వేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస పనులు కొనసాగుతున్నాయి.

Next Story