- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. క్షుద్రపూజల కోసం కూతురిని నరికి చంపిన సవతి తల్లి
యూపీలో దారుణం చోటు చేసుకుంది. 3ఏళ్ల కూతురును సవతి తల్లి తల నరికి హతమార్చింది. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. 3ఏళ్ల కూతురును సవతి తల్లి తల నరికి హతమార్చింది. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. త్రివేణి మౌర్య అనే వ్యక్తి భార్య ఏడాది క్రితం మరణించడంతో అతడు మరొకరిని వివాహం చేసుకున్నాడు. కాగా మంగళవారం రాత్రి 11 గంటలకు తన భార్య బయటకు వెళ్లడం త్రివేణి చూశాడు. ఆ సమయంలో భార్య ఎప్పుడూ బయటకు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చి అతడు ఆమె కోసం బయటకు వచ్చి వెతకడం మొదలు పెట్టాడు. చుట్టుపక్కలవాళ్లను సైతం సహాయం కోరడంతో వెతికేందుకు ఆయన వెంట వెళ్లారు.
కానీ ఆ లోపే ప్లాన్ ప్రకారం త్రివేణి భార్య తిరిగి ఇంటికి వచ్చి మూడేళ్ల కుమార్తెను గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేసింది. ఆమె తల శరీరం నుండి వేరు పడటం చూసి షాక్ అయ్యాడు. గ్రామస్థులు మహిళను పట్టుకుని పోలీసుకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన గదిలో దేవతల ఫోటోలు ఉండటంతో క్షుద్రపూజలు నేర్చుకునేందుకే హత్య చేసిందని అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.






