యోగా డే వేడుకల్లో తొక్కిసలాట.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడకలను నగరంలోని గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium)లో నిర్వహించారు.

యోగా డే వేడుకల్లో తొక్కిసలాట.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడకలను నగరంలోని గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium)లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma), మంత్రులు దామోదర రాజనర్సింహ, వాటికి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ప్రజలు భారీ స్థాయిలో హాజరయ్యారు. యోగాసానాలు ముగిసిన అనంతరం గేట్ నెంబర్ 2 వద్ద ఉచితంగా అల్పహారాన్ని పంపిణీ చేశారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా అక్కడికి పోటెత్తగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన సిబ్బంది ఆమెను 108 అంబులెన్స్‌‌లో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Next Story