హైదరాబాద్‌లో దారుణం.. 10మంది జువైనల్ బాలలపై స్టాఫ్ గార్డ్ లైంగికదాడి

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సైదాబాద్‌లోని ఓ జువైనల్ హోంలో బాలలపై లైంగిక దాడి జరగ్గా ఈ కేసులో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. స్టాఫ్ గార్డ్ రహమాన్ 10 మంది జువైనల్ బాలలపై లైంగికదాడి చేసినట్టు విచారణలో అధికారుల విచారణలో బయటపడింది.

హైదరాబాద్‌లో దారుణం.. 10మంది జువైనల్ బాలలపై స్టాఫ్ గార్డ్ లైంగికదాడి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సైదాబాద్‌లోని ఓ జువైనల్ హోంలో బాలలపై లైంగిక దాడి జరగ్గా ఈ కేసులో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. స్టాఫ్ గార్డ్ రహమాన్ 10 మంది జువైనల్ బాలలపై లైంగికదాడి చేసినట్టు విచారణలో అధికారుల విచారణలో బయటపడింది. గత కొంతకాలంగా రహమాన్ బాలను బెదిరించి వారిపై లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

బాధితుల్లోని ఓ బాలుడి తల్లి పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ జరపడంతో స్టాఫ్ గార్డ్ బండారం బయటపడింది. దసరా పండగకు ఇంటికి వెళ్లి తిరిగి జువెనైల్ హోంకు వెళ్లనని బాలుడు భోరున విలపించడంతో అసలు విషయం చెప్పినట్టు తెలుస్తోంది. ఇక విచారణలో ఒక బాలుడిపైనే లైంగిక దాడి జరిగిందని అనుకుంటే తరవాత ఆరుగురిపై లైంగిక దాడి జరిగినట్టు తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య పదికి చేరుకుంది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story