శ్రీశైలం దర్శనానికి వెళ్తుంటే కారు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

by Bhanu |

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి బ్రహ్మగిరి (దోమల పెంట) 4 కిలోమీటర్ల వద్ద చెట్టును

శ్రీశైలం దర్శనానికి వెళ్తుంటే కారు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి బ్రహ్మగిరి (దోమల పెంట) 4 కిలోమీటర్ల వద్ద చెట్టును కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. అటుగా వెళుతున్న ప్రయాణికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ వైపు నుండి శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న యువకులతో కూడిన ఒక కారు బ్రహ్మగిరి సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో చెట్టు నేలకొరిగిందని, కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. వారు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియాల్సి ఉంది. ప్రైవేటు అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Next Story