సవతి తల్లిపై కొడుకు అత్యాచారం.. గర్భందాల్చినా పట్టించుకోని తండ్రి

by Bhoopathi Nagaiah |

కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కామంతో కళ్లు మూసుకుపోయి, సవతి తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు.

సవతి తల్లిపై కొడుకు అత్యాచారం.. గర్భందాల్చినా పట్టించుకోని తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్ : రక్త సంబంధాల పవిత్రతను, తల్లీకొడుకుల బంధాన్ని మంటగలుపుతూ, మానవత్వం సిగ్గుపడే దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కామంతో కళ్లు మూసుకుపోయి, సవతి తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించి తెలిపిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

కామ పిశాచిగా మారిన కొడుకు

నాగ్‌పూర్‌ నగరంలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల వికాస్ శ్రీవాస్తవకు, 2024లో ఉద్యోగం వేటలో ఉన్న 26 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సాన్నిహిత్యానికి దారితీయడంతో, వికాస్ ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, వికాస్ మొదటి భార్య కుమారుడైన అక్షత్ శ్రీవాస్తవ (21) ఈ వివాహాన్ని మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇదే సమయంలో భార్యభర్తల మధ్య చిన్నచిన్న వివాదాలు స్టార్ట్ అయ్యాయి. పెద్దల మధ్య ఉన్న వివాదాలను ఆసరాగా చేసుకున్న అక్షత్, అమానుషానికి తెరలేపాడు. ఇంట్లో తండ్రి లేని సమయం చూసి సవతి తల్లి గదిలోకి ప్రవేశించి, ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ దారుణం అక్కడితో ఆగలేదు. నిందితుడు పలుమార్లు ఆమెను వేధిస్తూ లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ గర్భం దాల్చింది.

పరువు పేరుతో తండ్రి మౌనం

బాధితురాలు తాను పడుతున్న నరకాన్ని, అక్షత్ చేసిన అకృత్యాన్ని తన భర్త వికాస్‌కు వివరించింది. అయితే, కన్నకొడుకు భవిష్యత్తు పాడవుతుందని, సమాజంలో కుటుంబ పరువు పోతుందనే సాకుతో వికాస్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా బాధితురాలిని మౌనంగా ఉండాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. తండ్రి మద్దతు కూడా లభించకపోవడంతో అక్షత్ ఆగడాలు మృతిమీరాయి. తండ్రీకొడుకుల తీరుతో విసిగిపోయిన బాధితురాలు, చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిన దారుణాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు అక్షత్ శ్రీవాస్తవపై అత్యాచారంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

తల్లిపై కామవాంఛ తీర్చుకోవడమా..?

తల్లి అంటే దైవ సమానమని భావించే సంస్కృతిలో, కామ వాంఛ కోసం వరుసలను మరిచి ప్రవర్తించడం సామాజిక పతనానికి నిదర్శనం. ఒకవైపు కొడుకు అకృత్యం, మరోవైపు కళ్ళముందే అన్యాయం జరుగుతున్నా పరువు కోసం పాకులాడిన తండ్రి తీరు.. ఈ కేసులో అత్యంత విషాదకరమైన అంశం. పరువు అనేది మనిషి ప్రవర్తనలో ఉండాలి కానీ, ఇలాంటి నేరాలను కప్పిపుచ్చడంలో కాదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story