కాకరకాయ కూర వండినందుకు తల్లిని చంపిన కొడుకు

by Ajay Maddhiboyina |

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తనకు నచ్చని కూర వండినందుకు ఓ క్రూరుడు కన్నతల్లినే హతమార్చాడు.

కాకరకాయ కూర వండినందుకు తల్లిని చంపిన కొడుకు
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తనకు నచ్చని కూర వండినందుకు ఓ క్రూరుడు కన్నతల్లినే హతమార్చాడు. ఈ ఘటన చంద్రపూర్ జిల్లా, డోంగర్గావ్ గ్రామంలో చోటు చేసుకుంది. పెట్కులే అనే వ్యక్తి మద్యానికి బానిసవ్వడంతో భార్య అతని విడిచిపెట్టడంతో తల్లి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చిన జగదీష్ ఇంట్లో కాకరకాయ కూర వండటం చూసి తల్లితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ పెరగటంతో సహనం కోల్పోయి తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన తల్లి అక్కడిక్కడే మరణించింది. అనంతరం ..నేను నా తల్లిని చంపేశాను అంటూ గట్టిగా కేకలు వేస్తూ వీధిలో తిరిగాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story