అత్తను చంపి.. ఆపై దారుణానికి ఒడిగట్టిన అల్లుడు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

అత్తను చంపి.. ఆపై దారుణానికి ఒడిగట్టిన అల్లుడు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకలోని తుముకూరులో సంచలనం సృష్టించిన లక్ష్మీదేవమ్మ(42) హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యకు ఆమె అల్లుడు, దంత వైద్యుడు అయిన రామచంద్రరావు కారణమని విచారణలో తేలింది. తన భార్యను అత్త లక్ష్మీదేవమ్మ చెడు దారిలో నడిపిస్తుందని కోపం పెంచుకున్న అల్లుడు ఆమెను హత్య చేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే రామచంద్రరావు మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. లక్ష్మీదేవమ్మను చంపి, మృత దేహాన్ని 19 ముక్కలుగా నరికారు. ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు నిందితులు పలు ప్రాంతాల్లో శరీర భాగాలను పడేశారని పోలీసులు గుర్తించారు. ఈ దారుణం ఓ వీధి కుక్క ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story