- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో దారుణం.. అల్లుడి చేతిలో అత్త హతం
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. తన భార్యను అత్త కాపురానికి పంపకపోవడంతో.. కోపంతో ఊగిపోయిన అల్లుడు ఆమెపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. తన భార్యను అత్త కాపురానికి పంపకపోవడంతో.. కోపంతో ఊగిపోయిన అల్లుడు ఆమెపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా.. స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన కొమ్మూరు నాగసాయి, దుర్గాభవానీలు భార్యభర్తలు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో భవానీ సింగ్ నగర్లో ఉంటోన్న తన తల్లి కోలా దుర్గ (46) వద్దకు వెళ్లింది. కోపం తగ్గాక భార్య కాపురానికి వస్తుందని ఎదురుచూసిన నాగసాయి.. ఆమె ఎంతకూ రాకపోవడంతో.. తన అత్తే కాపురానికి రానివ్వడం లేదని కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో నాగసాయి ఆదివారం సింగ్ నగర్ కు వెళ్లి తన భార్యను కాపురానికి పంపాలని కోరాడు. దీంతో అత్త - అల్లుళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కోపం పట్టలేకపోయిన అతను.. వెంట తీసుకొచ్చిన కత్తితో దుర్గపై దాడిచేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ పిలిపించగా.. లోపలికి ఎక్కిస్తుండగానే మృతి చెందింది. దీంతో వెంటనే కిందకు దించేశాడు. కూతురు ఫిర్యాదుతో పోలీసులు నాగసాయిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూతురితో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. గతంలో కూడా భవానీ నాగసాయిపై వేధింపుల కేసు పెట్టినట్లు తెలుస్తోంది.






