అత్త‌, మామ‌ల వేధింపులు భ‌రించ‌లేక ఇల్ల‌రికం అల్లుడు ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : అత్త, మామల వేధింపులు భరించలేక ఇల్లరికం అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయి మైసమ్మ ఆలయం షెడ్డులో గురువారం చోటు చేసుకుంది.

అత్త‌, మామ‌ల వేధింపులు భ‌రించ‌లేక ఇల్ల‌రికం అల్లుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ, కామారెడ్డి : అత్త, మామల వేధింపులు భరించలేక ఇల్లరికం అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయి మైసమ్మ ఆలయం షెడ్డులో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన అన్వేష్ రెడ్డి (30) ఐదేళ్ల క్రితం మాచారెడ్డి మండలం ఘన పూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్ళాడు. గురువారం ఉదయం ఉగ్రవాయి కట్ట మైసమ్మ ఆలయం వద్ద గల షెడ్డులో అన్వేష్ రెడ్డి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్వేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. అందులో అత్తమామలు వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story