తండ్రి మరణం... కన్నీటితో పది పరీక్షకు హాజరైన కొడుకు

by Batti.Sumithra |   (  Updated:2026-03-23 05:41:02  IST  )

గద్వాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. అమరవాయి గ్రామానికి చెందిన కరీం (40) అనారోగ్యంతో మృతి చెందాడు.

తండ్రి మరణం... కన్నీటితో పది పరీక్షకు హాజరైన కొడుకు
X

దిశ, అలంపూర్ : గద్వాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. అమరవాయి గ్రామానికి చెందిన కరీం (40) అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, తండ్రి మృతదేహం అంత్యక్రియలకు సిద్ధమవుతున్న తరుణంలో.. కొడుకు సమీర్ 10 తరగతి పరీక్ష రాసేందుకు మానవపాడు పరీక్షా కేంద్రానికి వెళ్ళాడు. ​ఒకవైపు కన్న తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖం.. మరోవైపు భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. కన్నీళ్లు కారుస్తూ గుండె నిబ్బరంతో సమీర్ పరీక్షకు హాజరైన తీరు స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.

Next Story