- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. బెట్టింగ్ కు బలి..?
హైదరాబాద్ నగరంలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెట్టింగ్ మోజు కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

దిశ, జూబ్లీహిల్స్: హైదరాబాద్ నగరంలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెట్టింగ్ మోజు కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ సమీపంలో ఈ ఘటన సంచలనం రేపుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా మామదూరు గ్రామానికి చెందిన వీర్లపల్లి పవన్ (24) బేగంపేటలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఎల్లారెడ్డిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో నివసిస్తున్నాడు. ఆదివారం ఉదయం బాత్రూమ్‌కు వెళ్లిన పవన్, చాలా సేపటికి బయటకు రాకపోవడంతో హాస్టల్‌లోని స్నేహితులు అనుమానం చెంది సిబ్బందికి తెలియజేశారు. తలుపు పగులగొట్టి చూడగా, అతను టవల్‌తో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పవన్ సెల్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లకు సంబంధించిన సందేశాలు ఉండటాన్ని గుర్తించారు. ఇటీవల అతని అప్పులను తండ్రే చెల్లించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






