HYD: 14వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

by Gantepaka Srikanth |

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నలగండ్లలో చోటుచేసుకుంది.

HYD: 14వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
X

దిశ, శేరిలింగంపల్లి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నలగండ్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు (46) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నల్లగండ్లలోని రాంకీ గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉంటున్న నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇరు కుటుంబాల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. గత కొద్దిరోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్ రావు సోమవారం తాను ఉంటున్న అపార్ట్మెంట్ 14 అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడి ఆత్మహత్యకు కోడలు జ్యోతి కారణమని, ఆస్తులు తన పేరిట రాయాలని లేదంటే ఇంటికి రావద్దంటూ తన కుమారుడిని కోడలు వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదు మృతుడి తల్లి కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story