సీతారాం ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు: భర్త చనిపోయిన నెలకే ప్రియుడితో పెళ్లి

by Gantepaka Srikanth |

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణా రెడ్డిని అరెస్ట్ చేశారు.

సీతారాం ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు: భర్త చనిపోయిన నెలకే ప్రియుడితో పెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణా రెడ్డిని అరెస్ట్ చేశారు. సీతారాం ఆత్మహత్యకు భార్య వేధింపులు, ఆమె వివాహేతర సంబంధాలే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరిలో సీతారాం మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, భర్త చనిపోయిన దుఃఖం ఏమాత్రం లేకుండా, నెల రోజులు కూడా గడవకముందే (మార్చిలో) రేణుక తన ప్రియుడైన రమణా రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ పరిణామం సీతారాం కుటుంబ సభ్యులతో పాటు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.

19 పేజీల డెత్ నోట్.. బయటపడ్డ బండారం..

సీతారాం ఆత్మహత్యకు ముందు 19 పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. అందులో తన భార్య ప్రవర్తన గురించి దారుణమైన విషయాలను ప్రస్తావించారు. రేణుకకు రమణా రెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సీతారాం ఆరోపించారు. తన ప్రియుడితో కలిసి ఉన్న ఏకాంత దృశ్యాలను రేణుక స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందని, ఆ వీడియోలు చూసి తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని లేఖలో పేర్కొన్నారు. భార్య చేస్తున్న ఈ పనుల వల్ల సమాజంలో తల ఎత్తుకోలేక పోతున్నానని, అందుకే తనువు చాలిస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాం రాసిన లేఖ ఆధారంగా బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు, ఇతర ఆరోపణల నేపథ్యంలో రేణుక, రమణా రెడ్డిలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Next Story