- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవర్ ప్లాంట్‌లో కుప్పకూలిన శ్లాబ్.. 9 మంది కార్మికులు దుర్మరణం
పవర్ ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలి ఏకంగా తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన తమిళనాడు (Tamilnadu)లో ఇవాళ రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలి ఏకంగా తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన తమిళనాడు (Tamilnadu)లో ఇవాళ రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్నోర్ పవర్ ప్లాంట్ (Ennore Power Plant)లో ఇటీవల కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విధుల్లో ఉన్న 9 మంది కార్మికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తొటి కార్మికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు రెస్క్యూ టీమ్‌తో స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Next Story






