సియాకు అది ఇష్టంలేదు అందుకే చంపేశాం.. ప్రియుడు చేతన్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

పూణేలోని లోహ‌గ‌డ్ కోట వద్ద కాబోయే భ‌ర్త‌ను యువతి హ‌త్య చేసిన కేసులో కీల‌క విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. కాబోయే భార్య సియా అగ‌ర్వాల్, ఆమె ప్రియుడు చేత‌న్ చౌద‌రిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

సియాకు అది ఇష్టంలేదు అందుకే చంపేశాం.. ప్రియుడు చేతన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: పూణేలోని లోహ‌గ‌డ్ కోట వద్ద కాబోయే భ‌ర్త‌ను యువతి హ‌త్య చేసిన కేసులో కీల‌క విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. కాబోయే భార్య సియా అగ‌ర్వాల్, ఆమె ప్రియుడు చేత‌న్ చౌద‌రిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచార‌ణ‌లో పెళ్లి ఇష్టం లేక‌పోతే పారిపోవ‌చ్చు కదా ఎందుకు చంపేశారు అని పోలీసులు చేతన్‌ని ప్ర‌శ్నించారు. దానికి అత‌డు.. సియా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని తనతో పారిపోయేందుకు సిద్ధంగా లేదని చెప్పాడు. అలా చేస్తే తమ కుటుంబానికి అవమానం అని భావించిందని అన్నాడు.

అందువల్లే కేతన్ ను చంపాలని నిర్ణయించినట్టు తెలిపాడు. విచారణలో మరిన్ని నిజాలు బయటపడ్డాయి. జూన్ 14న సైతం సియా కేతన్ ను లోయలోకి తోసేందుకు ప్రయత్నించింది. కానీ అతడు చెట్ల కొమ్మలను పట్టుకుని కిందపడకుండా ఆగిపోయాడు. నన్ను ఎందుకు తోశావ్ అని ప్రశ్నించగా.. పాము వచ్చింది అంటూ అతడిని కాపాడినట్టు నమ్మించింది. ఇక జూన్ 18న మరోసారి సియా తన ప్రియుడు ఓ కేఫ్ లో కలుసుకున్నారు. ఆ సమయంలో హత్య ఎలా చేయాలని పక్కా పథకం రచించారు.

ముందుగానే తోసేయడానికి అనువుగా ఉండే ప్రదేశాలు ఏవి అక్కడకు ఎలా తీసుకువెళ్లాలి అని నిర్ణయించారు. అదే రోజు ప్రియుడు చేతన్ చౌదరి కూడా జంటను అనుసరిస్తూ వారి వెంటనే వెళ్లాడు. తన ప్రియురాలికి సైగలు చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. మ‌రోవైపు కేత‌న్ మ‌ర‌ణించిన త‌ర‌వాత సియాలో బాధ క‌నిపించ‌క‌పోవ‌డం, ఆమె ప‌దే ప‌దే లోహ‌గ‌డ్ కోట వ‌ద్ద‌కు రావాల‌ని అత‌డిని పిలిపించ‌డంతో కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం క‌లిగింది. ఈ నేప‌థ్యంలోనే వాళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా కేసులు న‌మోదు చేసి త‌మ స్టైల్ లో విచారించ‌గా అస‌లు నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

Next Story