ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

by Gantepaka Srikanth |

ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం బిలాస్‌పూర్‌‌లోని జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో 25 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమదాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story