- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలిఫోర్నియాలో జెట్ విమానం కూలి ఆరుగురు మృతి
by Javid Pasha |
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జెట్ విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జెట్ విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్రెచ్ వ్యాలీ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని రివర్ సైడ్ కౌంటీ షెరీఫ్ అధికారులు తెలిపారు. ఈ జెట్ విమానం శనివారం ఉదయం లాస్ వెగాస్ లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. ఇక ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు.
Next Story






