- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ కేసులో ‘సిట్’ స్పీడ్.. రెండున్నర గంటల పాటు స్నేహితుల విచారణ
బండి భగీరథ్ పోక్సో కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఈ మొత్తం ఉదంతాన్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నించిన 10 మంది భగీరథ్ స్నేహితులను ఇవాళ సిట్ విచారించింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhagirath)పై నమోదైన పోక్సో కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో కేవలం భగీరథ్ కాకుండా, అతడి స్నేహితుల ప్రమేయంపై కూడా పోలీసులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారని, ఆ తర్వాత ఈ ఉదంతం బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు వారు ప్రయత్నించారని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనను బయటపెట్టకుండా రాజీ కుదర్చడానికి, సెటిల్‌మెంట్ చేయడానికి వారు తీవ్రంగా యత్నించారని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దాదాపు 10 మంది భగీరథ్ స్నేహితుల పేర్లను ఆమె పోలీసులకు అందజేశారు.
పేట్ బషీరాబాద్ పీఎస్‌లో స్టేట్‌మెంట్ రికార్డ్
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ చీఫ్ రితిరాజ్ (Rithiraj) ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. భగీరథ్ స్నేహితుల నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు వారిని ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో సిట్ బృందం పలు కీలక ప్రశ్నలను వారి ముందుంచింది. ‘ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది?, బాధితురాలు ఆ సమయంలో ఏం చెప్పింది?, అందుకు భగీరథ్ ఎలా స్పందించాడు?, రాజీ కోసం ఎవరెవరు ఒత్తిడి తెచ్చారు? అనే కోణంలో ఆరా తీసి వారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారికంగా రికార్డు చేశారు. అదేవిధంగా వారి మొబైల్ ఫోన్లలో కాల్‌డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్ హిస్టరీలను కూడా పరిశీలించారు. వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ కేసులో మరికొంత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.






