సింగరేణి విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య

by Kema Shiva Kumar |

సింగరేణి విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

సింగరేణి విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, శంకరపట్నం : సింగరేణి విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కేశవపట్నం ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడికల్ గ్రామానికి చెందిన కీసర అంజయ్య సింగరేణిలో విధులు నిర్వర్తించి ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో కొడుకుకు వారసత్య ఉద్యోగం కొరకు ప్రయత్నించి విఫలం కావడంతో అంజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకుని అత్యహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కీసర భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

Next Story