- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలకో మర్డర్.. కాంట్రాక్ట్ క్రైమ్స్... వెలుగులోకి వస్తున్న సిగ్మా గ్యాంగ్ దారుణాలు
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం ఉదయం నలుగురు గ్యాంగ్ స్టర్స్ ఎన్కౌంటర్ అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం ఉదయం నలుగురు గ్యాంగ్ స్టర్స్ ఎన్కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. అయితే సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్ పేరిట చలామణి అయిన ఈ గ్యాంగ్ స్టర్స్ చేసిన లెక్కలేనన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. బీహార్ డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్ నాయకుడు రంజన్ పథక్ (25), బిమ్లేశ్ మహతో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) కాగా..వీరంతా నెలకు ఒకసారి నేరాలకు పాల్పడతారని, కాంట్రాక్టు మర్డర్స్ చేసేవారని అన్నారు.
వీరు బిహార్‌లోని సీతామర్హి, ఝార్ఖండ్, యూపీ, నేపాల్ సరిహద్దుల్లో పలు హత్యలకు పాల్పడ్డారని తెలిపారు. బ్రహ్మశ్రీ సేనా నాయకులు గణేశ్ శర్మ, మదన్ శర్మ, ఆదిత్యసింగ్ హత్యల్లో పాలుపంచుకున్నారని, అక్రమ ఆయుధాల సరఫరా, కిడ్నాపులు, దోపిడీల వంటి కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారని వెల్లడించారు. వీరు సాధారణంగా నేరం చేయడానికి ముందు రాష్ట్రం వెలుపల వెళ్లి ప్లాన్ చేసి, తిరిగి వచ్చి అమలు చేస్తారని.. ఇప్పుడు కూడా అలాగే ఎన్నికల సమయంలో కుట్రలకు ప్లాన్ చేసారని, అవి విజయవంతంగా భగ్నం చేశామని డీజీపీ తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ఈ గ్యాంగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి, నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసుల సమన్వయంతో చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ ముఠా ఆచూకీ తెలిసిందన్నారు. లొంగిపొమ్మని చెప్పినా వినకుండా కాల్పులు జరపడంతో పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు క్రిమినల్స్ చనిపోయారని వివరించారు. గతంలో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్‌ను ఎన్‌కౌంటర్ చేయడానికి బీహార్ పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిసారి తప్పించుకొని, ఈసారి మాత్రం గ్యాంగ్ తోసహా అంతం అయ్యాడు.






