Sigachi incident: చికిత్స పొందుతూ మరొకరు మృతి

by Gantepaka Srikanth |

సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamilaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 46కు చేరింది.

Sigachi incident: చికిత్స పొందుతూ మరొకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamilaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 46కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివాకర్(28) అనే యువకుడు గురువారం మృతిచెందారు. ఇప్పటికీ మరో ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. ఆ ఎనిమిది మంది కాలి బూడిద అయ్యుంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు చేసుకోవాలని సూచించారు. మరోవైపు తక్షణ సాయం కింద రూ.15 లక్షల చెక్కులను అధికారులు అందజేశారు. జూన్ 30న జరిగిన ఈ పేలుడులో 46 మంది మృతి చెందారు. ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం పరిహారం ప్రకటించాయి. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు సమయం పడుతుందని కార్మికులను స్వస్థలాలకు వెళ్లాలంటూ సూచించారు.

Next Story