- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియురాలిని చంపిన ఎస్‌ఐ
* ప్రియురాలిని చంపిన ఎస్‌ఐ * చిన్న వాగ్వాదంతో ప్రాణం తీసిన పోలీస్ ఆఫీసర్ * కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి * సోషల్ మీడియాలో న్యూస్ వైరల్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లా మౌదాహ పీఎస్ ఏరియాలో నగ్నంగా ఉన్న ఓ యువతి మృతదేహంపై సస్పెన్స్ కొనసాగింది. చివరకు ఆ హత్య చేసింది ఎస్ఐ అంకిత్ యాదవ్ అని తేలింది. సీఆర్పీఎఫ్ జవాన్ భార్య అయిన కిరణ్ భర్త, అత్తామాలపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్త సోదరుడిపై రేప్ కేసు కూడా ఫైల్ చేసింది. అయితే ఈ వరకట్నం కేసు విచారణను ఎస్ఐ అంకిత్‌కు అప్పగించగా.. ఇన్వెస్టిగేషన్ సమయంలో కిరణ్‌తో పరిచయం పెరిగింది.
ఆమె అత్తామామలకు వ్యతిరేకంగా అంకిత్ నిలబడటంతో.. ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయింది. అది కాస్త రొమాంటిక్‌గా మారింది. కానీ ఈ లవ్ స్టోరీ నిలవలేకపోయింది. కోర్టు హియరింగ్ తర్వాత ఒకే కారులో తిరిగివస్తున్న అంకిత్, కిరణ్ మధ్య వాగ్వాదం మొదలైంది. కోపంలో అంకిత్ ఆమెను ఇనుప రాడ్‌తో కొట్టడంతో చనిపోయింది. దీంతో బాడీని మౌదాహలో డంప్ చేయగా.. దర్యాప్తులో నిందితుడిగా మారాడు.






