రెండు లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ SI

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సబ్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు అవినీతి శాఖ అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

రెండు లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ SI
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సబ్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు అవినీతి శాఖ అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ఓ కోచింగ్‌ సెంటర్‌లో వర్క్ చేస్తున్న అమ్మాయి.. ఆ కోచింగ్ సెంటర్ ఆపరేటర్స్ ప్రతీక్ గుప్తా, రియాజ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది. కేసు వెనక్కి తీసుకోవాలంటే రూ. 50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిది. కాగా బాధితురాలిని కలిసిన సబ్ ఇన్‌స్పెక్టర్.. జరిగిన విషయాన్ని చర్చించాడు. ఆ తర్వాత ప్రతీక్, రియాజ్ తనకు కూడా రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశడు. దీంతో ప్రతీక్ యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్‌ను సంప్రదించగా.. లంచం తీసుకుంటున్న ఎస్ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

Next Story