దుకాణంపై దుండగుల దాడి.. చాలా తెలివిగా తప్పించుకున్న యజమాని.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

కొంద‌రు దుండ‌గులు య‌జ‌మానిపై దాడి చేసి దుకాణంలోని వ‌స్తువులు దోచుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా వారి నుండి ఎంతో తెలివిగా త‌ప్పించుకున్నాడు.

దుకాణంపై దుండగుల దాడి.. చాలా తెలివిగా తప్పించుకున్న యజమాని.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: కొంద‌రు దుండ‌గులు య‌జ‌మానిపై దాడి చేసి దుకాణంలోని వ‌స్తువులు దోచుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా వారి నుండి ఎంతో తెలివిగా త‌ప్పించుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని శివపురిలో జూలై 31న జరగ్గా ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో దుకాణం యజమాని షాపులో కూర్చుని ఉండగా కొందరు దుండగులు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, కర్రలతో వచ్చి దాడి చేశారు. దీంతో వెంటనే అతడు బయపడిపోయి వారికి లొంగకుండా షాపులోనికి వెళ్లి షెట్టర్ మూసివేశాడు.

ముగ్గురు దుండగులు ఆ షెట్టర్ తెరిచేందుకు కొద్దిసేపు ప్రయత్నించారు. కర్రలతో కొడుతూ, షెట్టర్ పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లోపల ఉన్న షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పాత కక్షల కారణంగానే దుకాణం యజమానిపై దాడి చేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇక వీడియో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు దాడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. చంపేందుకే వారు దాడి చేశారని, కానీ తెలివిగా తప్పించుకున్నాడని కామెంట్లు పెడుతున్నారు. యూపీ, ఎంపీలో ఇలాంటి దాడులు సాధారణమే అని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. video

Next Story