- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: లక్నో కోర్టులో కాల్పుల కలకలం.. మాజీ ఎమ్మెల్యే అనుచరుడు స్పాట్ డెడ్
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోర్టులో కాల్పుల కలకలం రేగింది. బుధవారం లక్నో కోర్టులో ఓ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోన్న సమయంలో

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో కాల్పుల కలకలం రేగింది. బుధవారం లక్నో కోర్టులో ఓ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోన్న సమయంలో కోర్టులోకి ప్రవేశించిన దుండగులు ప్రత్యర్థిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో రౌడీ షీటర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ అనుచరుడు ప్రధాన అనుచరుడు సంజీవ్ జీవ మృతి చెందాడు.
లాయర్ల దుస్తుల్లో కోర్టులోకి ప్రవేశించిన దుండగులు సంజీవ్ జీవపై కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల అనంతరం దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, కాల్పుల్లో మరణించిన సంజీవ్ జీవ ముక్తార్ అన్సారీకి కుడి భుజంలాగా వ్యవహరించేవాడు.
Next Story






