- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మందికి తీవ్ర గాయాలు
by Kema Shiva Kumar |
ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ ఈస్టర్న్ సబర్బ్స్‌లోని బాండీ బీచ్ (Bondi Beach)లో ఇద్దరు ఆగంతకులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ ఈస్టర్న్ సబర్బ్స్‌లోని బాండీ బీచ్ (Bondi Beach)లో ఇద్దరు ఆగంతకులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 10 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బీచ్ పరిసరాల్లో ఎవరూ ఉండకూడదని, అక్కడ లాక్‌డౌన్ విధించినట్లుగా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే, పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో కాల్పులు జరిపిన ఇద్దరు ఆగంతకులను అదుపులోకి తీసుకున్నారు. హనుక్కా ఉత్సవం సందర్భంగా జరిగిన ఈ కాల్పుల్లో మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు, మెడికల్ సిబ్బందిని మోహరించారు.
Next Story






