- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవవధువు ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. మటన్ కూరలో కారం ఎక్కువైందని
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో పెళ్లైన ఆరు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆరు రోజులకే ఆత్మహత్యకు పాల్పడటంతో ఏదైనా పెద్ద కారణమే ఉండవచ్చని అంతా అనుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో పెళ్లైన ఆరు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆరు రోజులకే ఆత్మహత్యకు పాల్పడటంతో ఏదైనా పెద్ద కారణమే ఉండవచ్చని అంతా అనుకున్నారు. మటన్ విషయంలో జరిగిన గొడవనే నవ వధువు ప్రాణం తీసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... ఎర్దండి గ్రామ శివారులోని వడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి (22) అదే కాలనీకి చెందిన సంతోష్ ప్రేమించి పెద్దలను ఒప్పించి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.
సెప్టెంబర్ 26న వీరి వివాహం జరగ్గా దసరా పండగ సందర్భంగా 2వ తేదీన గంగోత్రి భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. కొత్త అల్లుడి కోసం అత్తింటివారు పిండివంటలతో పాటు మటన్ కూడా వండిపెట్టారు. అయితే గంగోత్రి మటన్ కర్రీ చేయగా అందులో కారం ఎక్కువైందని భర్త సంతోష్ గొడవకు దిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో అదే రాత్రి భార్యను తీసుకుని తమ ఇంటికి వెళ్లిపోగా ఇంటివద్ద కూడా మటన్ విషయంలో మళ్లీ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భర్త తీరుతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పండుగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. గంగోత్రి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.






