- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో షాకింగ్ ఘటన.. ఆర్మీ కాంపౌండ్‌లోకి చొరబడిన నలుగురు అరెస్ట్
అనుమతి లేకుండా ఆర్మీ కాంపౌండ్ (Army Compound)లోకి చొరబడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అనుమతి లేకుండా ఆర్మీ కాంపౌండ్ (Army Compound)లోకి చొరబడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుమలగిరి (Tirumalagiri)లోని ఎంసీఈఎఈ (MCIEI)లోని టెక్నో చౌక్ గేటులోకి నలుగురు అపరిచితులు అక్రమంగా ప్రవేశించారు. ఏకంగా నకిలీ వైమానిక దళ అధికారి గుర్తింపు కార్డులు చూపించి లోపలికి వెళ్లారు. అనంతరం ఆర్మీ రహస్య ప్రాంతంలో సామగ్రిని ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా.. అక్కడున్న అధికారులు ప్రశ్నించారు. దీంతో వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆర్మీకి చెందిన కీలక సమాచారంపై ఫొటోలు, వీడియోలు తీసుకోవడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ.. లెఫ్టినెంట్ కల్నల్ (Lieutenant Colonel) తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






