షాకింగ్.. కూతురు అశ్లీల వీడియోలు తండ్రికి పంపి 10 లక్షలు డిమాండ్ చేసిన 9వ తరగతి బాలుడు

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాడులో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బాలిక అశ్లీల వీడియోలు రికార్డ్ చేసిన 9వ త‌ర‌గ‌తి బాలుడు ఆమె తండ్రికి పంపి రూ.10 ల‌క్ష‌లు డిమాండ్ చేశాడు. ఈ ఘ‌ట‌న కృష్ణ‌గిరి న‌గ‌రం స‌మీపంలోని రాయ‌క్కోటైసాలై స‌మీపంలో చోటు చేసుకుంది.

షాకింగ్.. కూతురు అశ్లీల వీడియోలు తండ్రికి పంపి 10 లక్షలు డిమాండ్ చేసిన 9వ తరగతి బాలుడు
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడులో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బాలిక అశ్లీల వీడియోలు రికార్డ్ చేసిన 9వ త‌ర‌గ‌తి బాలుడు ఆమె తండ్రికి పంపి రూ.10 ల‌క్ష‌లు డిమాండ్ చేశాడు. ఈ ఘ‌ట‌న కృష్ణ‌గిరి న‌గ‌రం స‌మీపంలోని రాయ‌క్కోటైసాలై స‌మీపంలో చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లి దండ్రులతో కలిసి అద్దెకు ఉంటున్న బాలుడు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బాలుడు గత కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఖాళీగా ఉండగా పక్కనే ఉండి బడిమానేసిన మరో ఇద్దరు అబ్బాయిలతో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో ముగ్గురు కలిసి తమ పై అంతస్థులో ఉండే, ఒకే పాఠశాలలో చదువుతున్న బాలికకు ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రిక్వెస్ట్ పెట్టారు. ఆ రిక్వెస్ట్ ను బాలిక యాక్సెప్ట్ చేయగా ఇన్ స్టాలో పెట్టిన ఆమె ఫోటోలను డౌన్ లోడ్ చేసి వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు. అనంతరం అవే ఫోటోలను బాలికకు పంపి న్యూడ్ వీడియో కాల్ చేయాలని, ఫోటోలు పంపాలని హెచ్చరించారు.

లేదంటే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బయపడిపోయిన బాలిక బాలుడికి వీడియో కాల్ చేయడం, ఫోటోలు పంపడంతో వాటిని సేవ్ చేసుకున్నాడు. వాటిని బాలిక తండ్రికి పంపి రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవి చూసి ఖంగుతిన్న బాలిక తండ్రి ఫోన్ నంబర్ చూసి ఆరా తీయగా అది కింద ఫ్లోర్ లో ఉండేవారిదేనని తేలింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ముగ్గురు బాలురను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.

Next Story