చండూరులో షాకింగ్ ఘటన.. పోలీసులను చితకబాదిన మందుబాబులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-08 05:19:24  IST  )

రాష్ట్రంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు.

చండూరులో షాకింగ్ ఘటన.. పోలీసులను చితకబాదిన మందుబాబులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు పీకల వరకు తాగి ఇన్నాళ్లు రోడ్లపై హల్‌చల్ చేసేవారు.. ఇప్పుడు పోలీసులపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే నల్లగొండ (Nalgonda) జిల్లా చండూరు (Chandur)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి మండల కేంద్రంలో ముగ్గురు యువకులు కలిసి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లి సదరు యువకులు మందలించారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో రెచ్చిపోయిన మందుబాబులు మద్యం మత్తులో ఏకంగా పోలీసులను చితకబాదారు. ఈ దాడిలో వారికి గాయాలయ్యాయి. దీంతో పెట్రోలింగ్ టీమ్ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story