భద్రాద్రి కొత్తగూడెంలో అమానవీయ ఘటన.. గర్భిణీ మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-19 08:19:50  IST  )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో లలిత అనే గర్భిణి మరణించగా ఆమె మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా బీఆర్ఎస్ నేత ప్రభాకర్ అడ్డుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో అమానవీయ ఘటన.. గర్భిణీ మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో లలిత అనే గర్భిణి మరణించగా ఆమె మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా బీఆర్ఎస్ నేత ప్రభాకర్ అడ్డుకున్నారు. గర్భిణీ శవం గ్రామంలోకి వస్తే కీడు జరుగుతుందనే మూఢనమ్మకంతో ప్రభాకర్ అడ్డు చెప్పినట్టు మృతురాలి కుటుంబ స‌భ్య‌లు చెబుతున్నారు.

దీంతో రాత్రంతా మృతదేహాన్ని ఊరి బయటే పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా తెల్లవారుజామున అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి కార‌ణ‌మైన‌ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఎవ‌రు మ‌ర‌ణించినా ఇప్ప‌టి నుండి ఊరి బ‌య‌టే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిచాల‌ని చెబుతున్నారు. ఏ కులం వాళ్లు చ‌నిపోయినా ఊరి బ‌య‌ట‌నే అంత్య‌క్రియ‌లు జ‌రపాల‌ని అన్నారు. జాడి ప్ర‌భాక‌ర్ అనే వ్య‌క్తి త‌ప్పు అంయింద‌ని ఒప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Next Story