మూడు సార్లు ఫెయిల్ నాలుగోసారి స‌క్సెస్..హనీమూన్ మర్డర్ కేసులో సంచ‌ల‌న నిజాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-13 12:34:38  IST  )

హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. పూజ‌ల పేరుతో మేఘాల‌య‌లోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి సోన‌మ్ త‌న భ‌ర్త రాజాను

మూడు సార్లు ఫెయిల్ నాలుగోసారి స‌క్సెస్..హనీమూన్ మర్డర్ కేసులో సంచ‌ల‌న నిజాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. పూజ‌ల పేరుతో మేఘాల‌య‌లోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి సోన‌మ్ త‌న భ‌ర్త రాజాను అతిదారుణంగా హ‌త్య చేయించింది. కాగా ఈ కేసు విచార‌ణ‌లో రోజు రోజుకు కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను ఎస్పీ వివేక్ స‌యీమ్ వెల్ల‌డించారు. రాజా ర‌ఘువంశీని చంపేందుకు అత‌డి భార్య సోన‌మ్, కిరాయి హంత‌కులు మూడు సార్లు ప్ర‌య‌త్నించి ఫెయిల్ అయిన‌ట్టు తెలిపారు. మొద‌టి ప్ర‌య‌త్నంలో గౌహ‌తిలో హ‌త్య చేయాల‌ని చూశార‌న్నారు.

త‌ర‌వాత మేఘాల‌య‌లోని సోహ్రాలో రెండు సార్లు చంపేందుకు విఫ‌ల‌య‌త్నం చేశార‌ని చెప్పారు. గౌహతిలో చంపాల‌ని అనుకున్నార‌ని, కానీ మృత‌దేహం మాయం చేయ‌డం క‌ష్టం అవుతుంద‌ని వెన‌క్కి త‌గ్గార‌ని చెప్పారు. త‌ర‌వాత నోంగ్రియాట్ లో చంపాల‌ని ప్ర‌య‌త్నించ‌గా అక్క‌డ కూడా డెడ్ బాడీ మాయం చేయడం క‌ష్టం అయ్యేలా ఉంద‌ని వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలిపారు. మ‌రోసారి మావ్లాకియాట్- వీసావ్ డాంగ్ మ‌ధ్య హ‌త్య చేయాల‌ని భావించి విఫ‌లం అయ్యార‌ని చెప్పారు. ఇక నాలుగో ప్ర‌య‌త్నంలో వీసావ్ డాంగ్ జ‌ల‌పాతం వ‌ద్ద హ‌త్య చేయ‌గా కిరాయి హంత‌కుల‌తో క‌లిసి సోన‌మ్ కూడా మృత‌దేహాన్ని నీటిలో తోసేసింద‌ని అన్నారు. ఇక ఈ కేసులో నిందితుల‌కు ప్ర‌స్తుతం రిమాండ్ విధించగా వారికి ఉరిశిక్ష ఖ‌రారు చేయాల‌ని ప్ర‌తిఒక్క‌రూ డిమాండ్ చేస్తున్నారు.

Next Story