- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనస్థలిపురం హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మాజీ భార్య గర్భిణి అని కూడా చూడకుండా
వనస్థలిపురం హత్య కేసులో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేశ్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరగ్గా పెళ్లి తరవాత సునీత భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లింది.

దిశ, వెబ్ డెస్క్: వనస్థలిపురంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. మహేశ్ అనే వ్యక్తి తన మాజీ భార్య సునీతను ఇంట్లోకి చొరబడి హత్య చేశాడు. నిందితుడు మహిళను చంపేందుకు కట్టర్, పెట్రోల్ తో వచ్చి తన వద్ద ఉన్న పదునైన కత్తులతో హతమార్చాడు. హత్య చేసిన అనంతరం కూడా పైశాచికంగా ప్రవర్తించాడు. కాగా ఈ కేసులో తాజాగా మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేశ్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరగ్గా పెళ్లి తరవాత సునీత భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లింది.
మహేశ్, సునీత ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సునీత చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఇండియాకు వచ్చేసింది. అంతే కాకుండా పదినెలల క్రితం శ్రీనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సునీత శ్రీనాథ్ తో కలిసి వనస్థలిపురంలో నివాసం ఉంటోంది. అంతేకాకుండా సునీత నాలుగు నెలల గర్భిణీ అని సమాచారం అందుతోంది. హత్య జరిగిన ఫ్లాట్ కూడా శ్రీనాథ్ దే అని పోలీసులు నిర్దారించారు. ఘటనకు సంబంధించి పోలీసులు శ్రీనాథ్ నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.






