- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమలాకర్ కేరాఫ్ క్రైమ్.. పేరుకే జ్యోతిష్యుడు చేసేవన్నీ అలాంటి పనులే
కర్ణాటకలో ఇటీవల ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు కమలాకర్ భట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కమలాకర్ కు సుచిత్ర అనే వివాహితతో వివాహేతర సంబంధం ఉండగా ఇటీవల తనకు అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై దాడి చేయించాడు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఇటీవల ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు కమలాకర్ భట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కమలాకర్ కు సుచిత్ర అనే వివాహితతో వివాహేతర సంబంధం ఉండగా ఇటీవల తనకు అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై దాడి చేయించాడు. ఈ క్రమంలో సుచిత్ర భర్త పక్కనే ఉన్న ఆమె మరిదిపై సైతం దాడి చేయగా తీవ్రగాయాలపాలై అతడు మరణించాడు. కాగా కమలాకర్ భట్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు జ్యోతిష్యం పేరుతో అనేక నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు.
గోశాల నిర్వహణ పేరుతో భూమిని ఆక్రమించినట్టు గుర్తించారు. అంతే కాకుండా 2005కు ముందు కమలాకర్ మరమరాలు అమ్మగా ఉన్నట్టుండి శివమొగ్గ సమీపంలోని తన ఊరు విడిచి కేరళకు వెళ్లి జ్యోతిష్యం నేర్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తరవాత బెంగుళూరు వెళ్లి అక్కడ జ్యోతిష్యంలో రాణించి ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎదిగాడు. అంతే కాకుండా ఈ క్రమంలో మోసాలకు పాల్పడేందుకు ప్రతి జిల్లాలో కొందరు దళారులను నియమించుకున్నాడు.
దళారులు జిల్లాల్లోని ప్రజలకు తమకు బెంగుళూరులో తెలిసిన జ్యోతిష్యుడు ఉన్నాడని అక్కడికి వెళితే సమస్యలు తీరతాయని నమ్మించేవారు. సుచిత్ర కూడా ఇలానే కమలాకర్ వద్దకు ప్రజలను పంపించేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడగా ఆమెను పెళ్లి చేసుకునేందుకు భర్త మహేశ్ నాయక్, కుమార్తెలు అడ్డుగా ఉన్నారని రౌడీ షీటర్ల సాయం తీసుకుని దాడి చేయించాడు. ఈ క్రమంలో మహేశ్ నాయక్ సోదరుడు మరణించాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






