చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. ‘ఐ-బొమ్మ’ రవి తండ్రి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

సినిమాలు, ఓటీటీ కంటెంట్లను పైరసీ చేస్తున్న ఐ-బొమ్మ( I-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. ‘ఐ-బొమ్మ’ రవి తండ్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలు, ఓటీటీ కంటెంట్లను పైరసీ చేస్తున్న ఐ-బొమ్మ( I-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రవి అరెస్ట్‌పై ఆయన తండ్రి అప్పారావు(Ravi Father Apparao) స్పందించారు. ఆదివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ‘15 ఏళ్ల క్రితం జాబ్ చేస్తానని ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. రవితో మాట్లాడి దాదాపు రెండు నెలల పైనే అవుతుంది. రవిపై నమోదైన కేసుల గురించి నాకు తెలియదు. సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. రవి విషయం హైదరాబాద్‌ పోలీసులు చూసుకుంటారు’’ అని రవి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‌పల్లిలోని రెయిన్‌ విస్టా ఫ్లాట్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్‌ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖగా పోలీసుల విచారణలో వెల్లడైంది. కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌లో అతడి ఫ్లాట్‌ నుంచి హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌, సర్వర్‌ నుంచి సమాచారం సేకరించిన సైబర్ క్రైమ్‌ పోలీసులు.. అప్‌లోడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను హోల్డ్‌ చేసినట్టు సమాచారం.

Next Story