- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. ప్రధాన అనుచరుడు అరెస్ట్
by Kema Shiva Kumar |
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు కూనసాని వినోద్ (Kunasani Vinod)ను ఇవాళ గుడివాడ (Gudiwada) వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా గుడివాడ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.50 వేల నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడు కూనసాని వినోద్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అయితే, తాజా ఘటన కొడాలి నానికి రాజకీయంగా మరో ఎదురుదెబ్బ అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీ నాయకుల వరుస అరెస్టుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






