మావోయిస్టులకు షెల్టర్.. పోలీసుల అదుపులో అర్బన్ కో-ఆర్డినేటర్ ప్రభంజన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-19 07:18:40  IST  )

రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టులు, అగ్ర నేతల లొంగుబాట్ల పర్వం కొనసాగుతోంది.

మావోయిస్టులకు షెల్టర్.. పోలీసుల అదుపులో అర్బన్ కో-ఆర్డినేటర్ ప్రభంజన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టులు, అగ్ర నేతల లొంగుబాట్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పోలీసులు ఓ మావోయిస్టు అర్బన్ కో-ఆర్డినేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులకు గుట్టుచప్పుడు కాకుండా షెల్టర్ ఇస్తున్న జన్నారం గ్రామానికి చెందిన పీడీఎస్‌యూ (PDSU) నేత ప్రభంజన్‌ (Prabhanjan)ను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే, గత కొన్నాళ్లుగా ప్రభంజన్ మావోయిస్టులకు షెల్టర్ పేరిట పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అతడిని జన్నారం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

కాగా, తెలంగాణ పోలీసులు చేపట్టిన మేజర్ ఆపరేషన్‌లో ఏవోబీ కమాండర్ ఎర్రోళ్ల రవి (Errolla Ravi)తో పాటు 35 మంది మావోయిస్టులు సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో హిడ్మా బెటాలియన్ కమాండర్లు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ డీజీపీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. మధ్యాహ్నం 2.30 గంటలకు డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టు గ్రౌండ్‌లో డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, వార్తాపత్రికల రిపోర్టర్లు, ఫొటో, వీడియో జర్నలిస్టులు హాజరు కావాలని డీజీపీ సీపీఆర్వో శ్రీనివాస రావు మీడియాకు సమాచారమిచ్చారు.

Next Story