విషాహారం తిని గొర్రెలు మృతి

by Nallavelli.Anjaneyulu |

విషాహారం తిని గొర్రెలు మృతి
X

దిశ‌, మ‌ల్యాల : విషాహారం తిని దాదాపు గొర్రెలు మృతి చెందిన ఘ‌ట‌న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రామన్నపేటలో సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నూకపెల్లి శివారులోని ఓ రైస్ మిల్ ప్రాంతంలో త‌డుక‌ గంగన్న చెందిన‌ 50 గొర్రెలు, దండిక మల్లేశం కి చెందిన 30 గొర్రెలను గత కొద్ది రోజులుగా పొలాల్లో మేపుతున్నారు. అయితే విషపు ఆహారం తినడం వలన శనివారం రాత్రి 50 గొర్రెలు, ఆదివారం 50 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. సుమారు 80 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు గొర్రెల కాపరులు వాపోయారు. అస్వతకు కు గురైన గొర్రెలు వెటర్నిటీ డాక్టర్లు వచ్చి చికిత్స అందించినప్పటికీ అప్పటికే ప్రయోజనం లేకుండా పోయింది. భారీ సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు రోధిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. గొర్రెలు చనిపోవడానికి కారణం విషపు ఆహారం, విషపు నీరు కానీ అయి ఉండ‌వ‌చ్చ‌ని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story