- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నాతో శారీరక సంబంధం పెట్టుకో' అంటూ వేధింపులు.. 'బుక్ చేసుకోండి' అంటూ స్టోరీల్లో..
సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

దిశ, సిటీక్రైం: సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మొదటి ఘటనలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతిని ఓ గుర్తుతెలియని వ్యక్తి నిత్యం అసభ్యమైన సందేశాలు పంపుతూ వేధించేవాడు. ‘‘నేను నీ బావను.. నాతో శారీరక సంబంధం పెట్టుకో’’ అంటూ నిబంధనలు అతిక్రమించే రీతిలో మెసేజ్‌లు పంపించాడు.
ఫోన్ కాల్స్ తో వేధించడంతో పాటు, ఫోన్ ఎత్తకపోతే ‘‘ఎవరితో మాట్లాడుతున్నావు?’’ అంటూ ఇన్‌స్టాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ, యువతిని “బుక్ చేసుకోండి” అంటూ స్టోరీల్లో అసభ్యంగా ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టేస్తానని బెదిరించాడు. భయాందోళనకు లోనైన బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో, వారు ప్రత్యేకంగా విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇక మరో ఘటనలో..
పాత స్నేహితురాలిని కలిసిన ఓ వ్యక్తి, ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ నెంబర్‌కు మళ్లీ మళ్లీ కాల్‌లు చేస్తూ, అర్ధరాత్రుల వరకు మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత మహిళ వివాహిత కావడం, పదే పదే వేధించడంతో విసిగిపోయిన ఆమె కూడా షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.






