మాల్‌లో దారుణం.. మహిళా ఉద్యోగులపై యజమాని, బావమరిది లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్.. వ్యాపారస్తులకు సప్లయ్..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలో మాల్‌లో జరుగుతున్న దారుణాలను బయటపెట్టింది మహిళా ఉద్యోగిని. ఈజీ మార్ట్, ఎస్ఎస్ మాల్స్ యజమాని అయిన ఉస్మాన్, అతని బావమరిది మహిళ ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారని,

మాల్‌లో దారుణం.. మహిళా ఉద్యోగులపై యజమాని, బావమరిది లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్.. వ్యాపారస్తులకు సప్లయ్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలో మాల్‌లో జరుగుతున్న దారుణాలను బయటపెట్టింది మహిళా ఉద్యోగిని. ఈజీ మార్ట్, ఎస్ఎస్ మాల్స్ యజమాని అయిన ఉస్మాన్, అతని బావమరిది మహిళ ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా.. వ్యాపారస్తులకు అమ్మాయిలను సప్లయ్ చేస్తున్నారని.. ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును అదనపు ఎస్పీకి అప్పగిస్తూ విచారణకు ఆదేశించారు.

మాల్ యజమాని, అతని బావమరిది తనతో తప్పుగా ప్రవర్తించారని.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు తెలిపింది. దీంతో ఆ మాల్‌లో పని చేయడం మానేశానని చెప్పింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఉస్మాన్ బావమరిది గౌహర్ అన్సారీ.. ఓ హిందూ యువతికి మ్యారేజ్ ప్రామిస్ చేసి మోసం చేశాడని ఎస్పీ విక్రాంత్ కౌర్ తెలిపారు. ఏఎస్పీకి కేసును అప్పగించినట్లు.. రిపోర్టు రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story