లైంగిక వేధింపుల ఆరోపణల కేసు.. పరారీలో స్వామి చైతన్యానంద సరస్వతి

by Kema Shiva Kumar |

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ (Delhi)లోని వసంత్ కుంజ్‌ (Vasanth Kunj)లో పరిధిలో ఉన్న శ్రీ శారదా ఐఐఎం (Sri Sarada IIM) డైరెక్టర్‌ స్వామి చైతన్యానంద సరస్వతి (Chaitanya Saraswati)పై ఇటీవలే పోలీసులు కేసు చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణల కేసు.. పరారీలో స్వామి చైతన్యానంద సరస్వతి
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ (Delhi)లోని వసంత్ కుంజ్‌ (Vasanth Kunj)లో పరిధిలో ఉన్న శ్రీ శారదా ఐఐఎం (Sri Sarada IIM) డైరెక్టర్‌ స్వామి చైతన్యానంద సరస్వతి (Chaitanya Saraswati)పై ఇటీవలే పోలీసులు కేసు చేశారు. EWS స్కాలర్‌షిప్ స్కీమ్ కింద PGDM కోర్సు చదువుతున్న 15 మందికి పైగా మహిళా విద్యార్థినులపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్మిషన్ల సమయంలో ఇంటర్వ్యూ చేసిన స్వామి చైతన్యానంద సరస్వతి మొత్తం 32 మంది మహిళా విద్యార్థినులలో 17 మందితో అసభ్యకరమైన భాష, అశ్లీల ఫొటోలు, వీడియోలను వారి వాట్సాప్‌కు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే, కొంతమంది కళాశాలలోని సీనియర్ విద్యార్థినులు మహిళా ఫ్యాకల్టీలు, అడ్మినిస్ట్రేటర్లు నిందితుడి డిమాండ్లకు లొంగిపోవాలని ఒత్తిడి తీసుకొచ్చారంటూ బాధిత విద్యార్థినులు ఆరోపించారు.

ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో నిందితుడు స్వామి చైతన్యానంద సరస్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఆగ్రా సమీపంలో ఉన్నట్లుగా మొబైల్ సిగ్నల్ ద్వారా ట్రాక్ చేశారు. ఈ కేసులో కళాశాలలోని సీసీ టీవీ ఫుటేజీతో పాటు కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ పరీక్షల నిమిత్తం పంపారు. అదేవిధంగా స్వామి చైతన్యానంద స్వామి వాడిన ఫేక్ నెంబర్ ప్లేట్‌తో ఉన్న లగ్జరీ రెడ్ వోల్వో కారును కూడా సీజ్ చేశారు. ఈ మేరకు నిందితుడిపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 345(3)/318(4)/336(3)/340(2) కింద కేసు నమోదు చేశారు. కాగా, శ్రీ‌శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణామ్నాయ శ్రీశారదా పీఠం, శృంగేరి పీఠాలతో నిందితుడికి సంబంధాలు ఉండటం కొనమెరుపు.

Next Story