- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైంగిక దాడులు, డ్రగ్స్ దందాలు.. ఈ అపార్ట్‌మెంట్‌లో ఎంత పెద్ద నేరం జరిగినా బయటికి పొక్కదు
ఈ అపార్ట్మెంట్ లో చట్టాన్ని పక్కనపెట్టి.. Own justice system పేరుతో అక్కడ ఏ నేరం జరిగినా..

దిశ, వెబ్‌డెస్క్: ఈ అపార్ట్మెంట్ లో చట్టాన్ని పక్కనపెట్టి.. Own justice system పేరుతో అక్కడ ఏ నేరం జరిగినా బయటికి పొక్కనివ్వకుండా అంతర్గత విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి ఫైన్లు వసూలు చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో అపార్ట్మెంట్ అసోసియేషన్, దాని సెక్యూరిటీ ఏజెన్సీపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని ప్రొవిడెంట్ సన్‌వర్త్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ లో వెలుగుచూసింది. నైరుతి బెంగళూరులోని దొడ్డబెలెలో ఉన్న ప్రొవిడెంట్ సన్‌వర్త్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్, టైకో సెక్యూరిటీ ఏజెన్సీపై కుంబళగోడు పోలీసులు కేసు నమోదు చేశారు.
అపార్ట్మెంట్లో దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఉంటున్నారు. లైంగిక దాడులు జరిగినా, దొంగతనాలు జరిగినా, డ్రగ్స్ వాడినా.. ఎంత పెద్ద నేరాలైనా సరే బయటికి రానివ్వకుండా అంతర్గత విచారణ చేస్తూ ఫైన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు కూడా ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ సొంతంగా కొన్ని నిబంధనలను రూపొందించుకున్నట్లు తెలిపారు. కొన్ని నెలల్లోనే డ్రగ్స్ వినియోగాలకు సంబంధించి రూ.25వేల వరకూ ఫైన్లు రాబట్టినట్లు తెలిసిందని డీసీపీ అనిత బి హద్దన్నవర్ తెలిపారు. ఆరోపణల ఆధారంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ ప చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.






