లైంగిక వేధింపుల కేసు: దంపతులకు మరణశిక్ష

by Gantepaka Srikanth |

పోక్సో కేసులో ఉత్తరప్రదేశ్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ఇంజినీర్‌, ఆయన భార్యకు మరణ శిక్ష విధించింది.

లైంగిక వేధింపుల కేసు: దంపతులకు మరణశిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: పోక్సో కేసు(POCSO Case)లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ కోర్టు(Uttar Pradesh Special Court) సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ఇంజినీర్‌, ఆయన భార్యకు మరణ శిక్ష విధించింది. వీరు 2010 నుంచి పదేళ్లపాటు 33 మంది మైనర్లను లైంగికంగా హింసించినట్లు, వేధించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో పాటు ఆ 33 మందికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నిందితులు చాక్లెట్ల ఆశచూపి మైనర్లను దారుణంగా వేధిస్తూ వీడియోలను చిత్రీకరించి డార్క్‌వెబ్‌లో అమ్మేవారు. విషయం వెలుగులోకి రావడంతో 2020 అక్టోబర్‌లో వీరిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. పోక్సో చట్టం, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నేళ్లు ఈ కేసుపై విచారణ కోర్టు.. చివరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది.

Next Story