మైనర్ గర్ల్ కావాలా.. అయితే గంటకు రూ. 7500.. రాష్ట్రంలో సెక్స్ రాకెట్..

by Sujitha Rachapalli |

* మైనర్ గర్ల్ కావాలా? అయితే గంటకు రూ. 7500 * స్పా సెంటర్ ముసుగులో సెక్స్ వర్క్ * సెక్స్ రాకెట్ బస్ట్ చేసిన పోలీసులు.. హెచ్చరిక

మైనర్ గర్ల్ కావాలా.. అయితే గంటకు రూ. 7500.. రాష్ట్రంలో సెక్స్ రాకెట్..
X

దిశ, వెబ్ డెస్క్: మైనర్ గర్ల్ కావాలా? అయితే గంటలకు రూ. 7500 చెల్లించాల్సిందే. ప్రత్యేక సేవల కోసం మరింత డబ్బు చెల్లించాల్సిందే. స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న సెక్స్ రాకెట్‌ను బస్ట్ చేశారు పోలీసులు. అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అనే ఎన్జీఓ సమాచారం ఆధారంగా రైడ్ చేసిన ఢిల్లీ పోలీసులు.. రోహిణిలోని మంగళం ప్యాలెస్ మాల్‌లోని క్రిస్టల్ బ్యూటీ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు మహిళలు, ఆరుగురు మైనర్ గర్ల్స్‌ను రక్షించారు. స్పా సర్వీస్ అని చెప్పి.. వేశ్యావృత్తిలో బలవంతంగా జాయిన్ చేశారని తెలుస్తోంది.

నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. POCSO, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. కాగా బాధిత అమ్మాయిలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్ ప్రాంతాల నుంచి వర్క్ ఇండియా పోర్టల్ ద్వారా ఉద్యోగానికి అప్లయ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story